Bank Holidays: జనవరిలో బ్యాంకులకు 15 రోజుల పాటు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే..!
మరికొన్ని రోజుల్లో 2024 ఏడాది ఎండ్(End) కాబోతుంది. మరో మూడు రోజులైతే 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.
దిశ, వెబ్‌డెస్క్: మరికొన్ని రోజుల్లో 2024 ఏడాది ఎండ్(End) కాబోతుంది. మరో మూడు రోజులైతే 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో 2025 జనవరి నెలకు సంబంధించి బ్యాంక్ సెలవుల(Bank Holidays) జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తాజాగా విడుదల చేసింది. పండుగలు(Festivals), లోకల్ హాలిడేస్(Local Holidays) కలుపుకొని జనవరిలో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు ఏకంగా 15 రోజుల పాటు సెలవులు ఉన్నాయి.
2025 జనవరిలో బ్యాంక్ సెలవుల లిస్ట్ ఇదే..
- జనవరి 1 (న్యూ ఇయర్) : అన్ని బ్యాంకులకు సెలవు.
- జనవరి 2 (గురువారం) : మన్నం జయంతి - కేరళలోని బ్యాంకులకు సెలవు.
- జనవరి 5 (ఆదివారం) : అన్ని బ్యాంకులకు సెలవు.
- జనవరి 6 (సోమవారం) : గురు గోవింద్ సింగ్ జయంతి- హరియాణా, పంజాబ్‌ల్లోని బ్యాంక్‌లకు సెలవు.
- జనవరి 11 (రెండో శనివారం) : అన్ని బ్యాంకులకు సెలవు.
- జనవరి 12 (ఆదివారం) : ఆదివారం బ్యాంకులు సెలవు.
- జనవరి 14 (మంగళవారం) : మకర సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని బ్యాంకులకు హాలీడే ఉంటుంది.
- జనవరి 15 (బుధవారం) : తిరువళ్లువార్ డే సందర్భంగా తమిళనాడులోని బ్యాంకులకు సెలవు.
- జనవరి 16 (గురువారం) : ఉజ్ఙవర్ తిరునాళ్ సందర్భంగా తమిళనాడులోని బ్యాంకులకు సెలవు.
- జనవరి 22 (బుధవారం) : ఇమోయిన్ ఇరత్ప- మణిపుర్‌లోని బ్యాంకులకు సెలవు.
- జనవరి 23 (గురువారం) : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా త్రిపుర, ఒడిశా, పంజాబ్, సిక్కిం, బంగాల్, జమ్ముకశ్మీర్, దిల్లీల్లోని బ్యాంకులకు సెలవు.
- జనవరి 25 (నాలుగో శనివారం) : అన్ని బ్యాంకులకు సెలవు.
- జనవరి 26 (ఆదివారం) : రిపబ్లిక్ డే- అన్ని బ్యాంకులకు సెలవు.
- జనవరి 30 (గురువారం) : సోనమ్ లోసర్- సిక్కింలోని బ్యాంకులకు సెలవు.