Elon Musk: శ్రీరామ్‌ కృష్ణన్‌ పై జాత్యాహంకార వ్యాఖ్యలు.. మద్దతు తెలిపిన మస్క్..!

అమెరికా(America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి ఎన్నికైన తర్వాత తన క్యాబినెట్ లో పలువురు భారత సంతతి వ్యక్తులకు చోటు కల్పించిన విషయం తెలిసిందే.

Update: 2024-12-28 16:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి ఎన్నికైన తర్వాత తన క్యాబినెట్ లో పలువురు భారత సంతతి వ్యక్తులకు చోటు కల్పించిన విషయం తెలిసిందే. ఇటీవలే మరో అమెరికన్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ అయినా శ్రీరామ్‌ కృష్ణన్‌(Sriram Krishnan)ను తన పాలక వర్గంలో చోటు కల్పించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్‌గా ఆయనను నియమిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని 'ట్రూత్(Truth)' వేదికగా అధికారికంగా ప్రకటించారు. దీంతో కృష్ణన్‌ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. ఇదిలా ఉంటే.. శ్రీరామ్‌ కృష్ణన్‌ ను ఉద్దేశిస్తూ ఓ వ్యక్తి తాజాగా ఎక్స్(X) వేదికగా జాత్యాహంకార వ్యాఖ్యలు చేశాడు. శ్రీరామ్‌ ను బటర్ చికెన్(Butter Chicken)గా చూపించే చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ఈ పోస్టుకు వ్యాపారి జాసన్(Jason) స్పందిస్తూ.. 'ఈ జాత్యాహంకార దాడులు అసహ్యకరం' అని కామెంట్ చేశారు. దీనికి ఎలాన్ మస్క్(Elon Musk) రిప్లై ఇస్తూ 'హండ్రెడ్ పాయింట్స్' ఎమోటికాన్(Emoticon)తో తన మద్దతును తెలిపారు.

Tags:    

Similar News