Bank Holidays: 2025 మొదటి నెలలో 10 బ్యాంకు సెలవులు

2025 ఏడాదికి సంబంధించి ఆర్‌బీఐ సెలవుల జాబితాను ఇంకా విడుదల చేయాల్సి ఉంది.

Update: 2024-12-28 13:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: మరికొన్ని గంటల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. 2025 ఏడాది మొదటి నెలలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి బ్యాంకులు ఏయే తేదీల్లో మూసేస్తారనే సమాచారం తెలుసుకోవడం ముఖ్యం. మొదటి నెల జనవరిలో దాదాపు 10 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. సాధారణంగా ఉండే రెండు, నాలుగవ శనివారం, ఆదివారాలు బ్యాంకులు పనిచేయవు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో జనవరి 1వ తేదీనే సెలవుతో బ్యాంకులు కొత్త ఏడాదిని ప్రారంభించనున్నాయి. 2025 ఏడాదికి సంబంధించి ఆర్‌బీఐ సెలవుల జాబితాను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. అయితే, బ్యాంకు సెలవు దినాల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలలో లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బ్యాంకు కార్యకలాపాలకు మాత్రమే వీలవదు. ఈ సెలవుల్లో కొన్ని అన్ని రాష్ట్రాలకు వర్తించవు. త్వరలో ఆర్‌బీఐ అధికారికంగా సెలవుల జాబితా విడుదల అయ్యాక దీనిపై స్పష్టత వస్తుంది.

జనవరి, 2025లో బ్యాంక్ సెలవులు ఇవే..

- 1 జనవరి, బుధవారం: నూతన సంవత్సర దినోత్సవం - దేశవ్యాప్తంగా

- 6 జనవరి, సోమవారం: గురు గోవింద్ సింగ్ జయంతి - కొన్ని రాష్ట్రాలు

- 11 జనవరి, శనివారం: రెండవ శనివారం - దేశవ్యాప్తంగా

- 12 జనవరి, ఆదివారం: స్వామి వివేకానంద జయంతి - పశ్చిమ బెంగాల్

- 13 జనవరి, సోమవారం: లోహ్రీ - పంజాబ్, కొన్ని రాష్ట్రాలు

- 14 జనవరి, మంగళవారం: సంక్రాంతి - కొన్ని రాష్ట్రాలు

- 15 జనవరి, బుధవారం: తిరువల్లువర్ దినోత్సవం - తమిళనాడు

- 23 జనవరి, గురువారం: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి - కొన్ని రాష్ట్రాలు

- 24 జనవరి, శనివారం: నాల్గవ శనివారం - దేశమంతటా

- 26 జనవరి, ఆదివారం: గణతంత్ర దినోత్సవం - దేశమంతటా

ముఖ్యమైన గమనిక:

బ్యాంకులు మూసేసినప్పటికీ, లావాదేవీల కోసం ఏటీఎంలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లను ఉపయోగించవచ్చు. వివిధ కారణాలతో బ్యాంకు సెలవుల్లో మార్పులుండోచ్చు. స్థానికంగా కనుక్కోవడం మంచిది.  

Tags:    

Similar News