Manmohan Singh's last rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

భారత మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్ (Manmohan Singh) అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగంబోధ్‌ ఘాట్‌ లో సైనిక లాంఛనాలతో అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించారు.

Update: 2024-12-28 07:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్ (Manmohan Singh) అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగంబోధ్‌ ఘాట్‌ లో సైనిక లాంఛనాలతో అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ దంఖర్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా సహా కేంద్రమంత్రులు ఇప్పటికే నిగంబోధ్ ఘాట్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా ప్రముఖులు కూడా శ్మశానవాటికకు చేరుకున్నారు. ఇకపోతే, పార్టీలకు అతీతంగా త్రివిధదళాలకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహించారు.

ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఊరేగింపు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గురువారం సాయంత్రం కన్నుమూశారు. శుక్రవారం ఆయన నివాసంలో మాజీ ప్రధానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఇక, శనివారం ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్‌ భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ సహా పలువురు నేతలు మన్మోహన్‌ పార్థివదేహం వద్ద అంజలి ఘటించారు. అంతకుముందు, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుండి మన్మోహన్ సింగ్ ప్రారంభమైంది. అక్కడ పార్టీ నాయకులు మాజీ ప్రధానికి నివాళులర్పించారు. "మన్మోహన్ సింగ్ అమర్ రహే " అని ఆయన మద్దతుదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ.. మన్మోహన్ సింగ్‌ కుటుంబసభ్యుల వెంటే శ్మశాన వాటికకు చేరుకున్నారు.

Tags:    

Similar News