లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు

వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వ్యక్తిపై శుక్రవారం తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

Update: 2024-12-27 16:01 GMT

దిశ,తిరుమలాయపాలెం : వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వ్యక్తిపై శుక్రవారం తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జింకలగూడెం గ్రామానికి చెందిన మహమ్మద్ సైదా అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కూచిపూడి జగదేశ్ తెలిపారు. 


Similar News