Trending: మరోసారి కోపంతో ఊగిపోయిన కోహ్లీ.. ఈసారి ఎందుకంటే? (వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. గ్రౌండ్‌లో ప్లేయర్ల మాట అటుంచితే.. ఆసిస్ అభిమానులు టీమిండియా (Team India) ప్లేయర్లపై చేస్తున్న అనిచిత వ్యాఖ్యలు వారికి కోపం తెప్పిన్నాయి. తాజాగా, రెండో రోజు ఆటలో భాగంగా విరాట్ కోహ్లీ (Virat Kohli) (36) పరుగులు చేసి స్కాట్ బోలాండ్ (Scott Boland) బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు పెవీలియన్‌కు వెళ్తుండగా.. ఆసిస్ అభిమానులు కోహ్లీ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో విరాట్ కోహ్లీకి చిర్రెత్తి వెనక్కి వచ్చి కామెంట్ చేసిన వారివైపు గుర్రుగా చూశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌తో అమర్యాదగా ప్రవర్తించడం సరైన విషయం కాదని కౌంటర్ ఇస్తున్నారు. ఆసిస్ అభిమానులు హద్దులు దాటుతున్నారని.. ఇకనైనా క్రీడా స్ఫూర్తిని నిలబెట్టేలా ప్రవర్తించాలని మండిపడుతున్నారు.
ఇప్పటికే కోహ్లీకి భారీ జరిమానా..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి రోజు ఆటలో ఆసిస్ తరఫున అరంగేట్రం చేసిన సామ్ కోన్‌స్టాస్, విరాట్ కోహ్లీ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్ తరువాత సామ్ కోన్‌స్టాస్ (Sam Constance) మరో ఎండ్ వైపు నడుస్తుండగా కోహ్లీ అతడికి ఎదురుగా వెళ్లి డ్యాష్ ఇచ్చి అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja), అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరిని పక్కకు తీసుకెళ్లి వివాదం సద్దుమణిగేలా చేశారు. అయితే, అంపైర్ల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన మ్యాచ్ రిఫరీ ఐసీసీ నిబంధనల ప్రకారం లెవల్-1 నేరంగా పరిగణించి విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజ్‌లో 20 శాతం కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ (Demerit Point) కేటాయించారు.