అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
తుంగతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని మండల విద్యాశాఖ అధికారి బోయిని లింగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దిశ,తుంగతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని మండల విద్యాశాఖ అధికారి బోయిని లింగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భౌతిక శాస్త్రం (సిఆర్టి),ఇంగ్లీష్ (సిఆర్టి) తాత్కాలిక ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ,బీఈడీ అర్హత కలిగి ఉండవలెనని,పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఈ నెల 31 లోగా మండల విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ.18 వేల వేతనం ఇవ్వబడుతుందని తెలిపారు.