యథావిధిగా రైతు భరోసా అమలు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం ఏక కాలంలో యథావిధిగా రైతు భరోసా అమలు చేయాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి పాదూరు శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2024-12-27 11:43 GMT

దిశ, వేములపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఏక కాలంలో యథావిధిగా రైతు భరోసా అమలు చేయాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి పాదూరు శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా రైతు భరోసా నిధులు వానాకాలం విడుదల చేయకపోవడంతో..రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత ప్రభుత్వం భూమి పట్ట ఉన్న ప్రతి రైతుకు 5 వేల రైతు బంధు పేరిట అమలు చేశారన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామని ప్రకటించి, వానాకాలం, యాసంగి సీజన్లకు నేటికి అసలు రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంతో..రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యాసంగి సీజన్ ప్రారంభమై నాట్లు వేస్తున్న తరుణంలో వెంటనే రెండు సీజన్లకు కలిపి ఒకే విడతలో రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్నారు. ఎన్నికల హామీలలో ప్రకటించిన విధంగా ఎకరానికి 7500 రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలిపి ఎకరానికి 15 వేల రూపాయలు భూమి పట్టా ఉన్న ప్రతి రైతుకు వెంటనే అకౌంట్ లో రైతు భరోసా నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు రొండి శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ పాదూరు గోవర్దన, సీపీఎం మండల నాయకులు పతాని శ్రీను, అయితగాని విష్ణు, పుట్ట సంపత్ తదితరులు పాల్గొన్నారు.


Similar News