మల్టీ పర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలి

గ్రామపంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే మల్టీపర్పస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నాగేష్ డిమాండ్ చేశారు

Update: 2024-12-27 15:11 GMT

దిశ, చిట్యాల: గ్రామపంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే మల్టీపర్పస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నాగేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం చిట్యాల పట్టణ కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో.. నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని అన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారిగా చెల్లించాలని కోరారు. గ్రామపంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు ఆరూరి శ్రీను, సిఐటియు మండల కార్యదర్శి మహంకాళ బాలమ్మ, మండల నాయకులు వలిగొండ లింగయ్య, సిరిపంగి యాదయ్య, నందిపాటి గణేష్, మేడి వసంత, మహంకాళి సత్తెమ్మ, గుర్రం లింగస్వామి, బొడ్డుపల్లి నరసింహ, వడ్డేపల్లి సువర్ణ, మేడి శంకరయ్య, నల్లబెల్లి నరసింహా, రెడపాక యాదయ్య, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.


Similar News