విద్యుత్ ఘాతంతో పదో తరగతి విద్యార్థి మృతి..

విద్యుత్ ఘాతానికి గురై యువకుడు మృతి చెందిన సంఘటన గుర్రంపొడు మండలం మక్కపల్లి గ్రామంలో శనివారం ఉదయం జరిగింది.

Update: 2024-12-28 05:44 GMT

దిశ, గుర్రంపొడు : విద్యుత్ ఘాతానికి గురై యువకుడు మృతి చెందిన సంఘటన గుర్రంపొడు మండలం మక్కపల్లి గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే గుర్రంపొడు మండలం మక్కపల్లి గ్రామానికి చెందిన నేతళ్ళ కిరణ్ (15) అనే యువకుడు ఫోన్ మాట్లాడుతూ డాబా పైకి ఎక్కాడు. ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిరణ్ కొండమల్లేపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కిరణ్ మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు.


Similar News