వేధింపులతో మహిళ వీఓఏ ఆత్మహత్యాయత్నం
విధులు నిర్వహించే క్రమంలో ఇద్దరు వ్యక్తులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని మహిళ వీఓఏ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
దిశ,నల్లగొండ క్రైం: విధులు నిర్వహించే క్రమంలో ఇద్దరు వ్యక్తులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని మహిళ వీఓఏ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఈ నెల23న సాయంత్రం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుండెబోయిన గూడెంలో చోటుచేసుకుంది.ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం..గుండెబోయినగూడెం గ్రామానికి చెందిన అమరారపు సైదమ్మ వీఏవోగా విధులు నిర్వహిస్తోంది. మండల మహిళ సమాఖ్య పాలకకవీడులో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న పిల్లలమర్రి సాయి,మరో జర్నలిస్టు మున్న నగేష్ వేధింపులకు గురిచేస్తూ..కులంపేరుతో దూషిస్తున్నారని తీవ్ర మనోవేదన చెందింది. ఈనెల 23న సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించి కుటుంబీకులు వెంటనే నేరేడుచర్లకు, అటు నుంచి హుజూర్ నగర్,సూర్యాపేటకు తీసుకెళ్లారు. అనంతరం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా..ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో పాలకవీడు పోలీస్ స్టేషన్లో ఎస్టీ, ఎస్టీ కేసు నమోదు చేసి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారని ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.
Read More..