నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి
మాతా శిశు కేంద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
దిశ, నల్లగొండ క్రైం: మాతా శిశు కేంద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిందని బాధితులు ఆరోపిస్తున్నారు. దామరచర్ల మండలం జైలోతు తండాకు చెందిన రాజేశ్వరి (25) మొదటి కాన్పు కోసం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాతా శిశుకేంద్రంలో రెండు రోజుల క్రితం జాయిన్ అయ్యింది. శుక్రవారం మగశిశువుకు జన్మనిచ్చింది. శనివారం సాయంత్రం రాజేశ్వరి చనిపోయిందని, వైద్యుల నిర్లక్ష్యతోనే ఈ ఘటన జరిగిందని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు.