నిషేధిత గంజాయి పట్టివేత
కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ శివారులో పోలీసులు దాడులు నిర్వహించారు.
దిశ,కోదాడ : కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ శివారులో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 900 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని..ఇద్దరు యువకులు మీసాల మధు, ఇంజమూరి యశ్వంత్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసుల తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ శంకర్ మాట్లాడుతూ.. నిషేధిత గంజాయిని నిర్మూలించేందుకు ఎక్సైజ్ పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా గంజాయి సేవించిన, విక్రయించిన, నిల్వ ఉంచిన సమాచారం అందించాలని ,తక్షణమే చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఆయన వెంట ఎస్సైలు గోవర్ధన్, రామకృష్ణ, యాదయ్య, సిబ్బంది అసగర్ అలీ, శ్రీనివాస్ లక్ష్మీనారాయణరావు, సలీం, దాసు, రాము, నరేష్, బాలు, జ్యోతి, భవాని తదితరులు పాల్గొన్నారు