310 గ్రాముల గంజాయి పట్టివేత..
సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్ గిర్ని చౌరస్తాలో గురువారం సాయంత్రం పోలీసులు గంజాయి పట్టుకున్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 27: సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్ గిర్ని చౌరస్తాలో గురువారం సాయంత్రం పోలీసులు గంజాయి పట్టుకున్నారు. డిచ్ పల్లి సీఐ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం..గురువారం సాయంత్రం పెద్ద వాల్గొట్ గిర్ని వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నమన్నారు. వారి వద్ద తనీఖీ చేయగా..60 గ్రాముల గంజాయి దొరికిందన్నారు. నిందితులు ఓరగంటి శ్రీనివాస్, చిత్తరి తరుణ్ తో పాటు.. ఓ మైనర్ ను కూడా స్టేషన్ కు తరలించారు. యశ్వంత్, నరేశ్ అనే వ్యక్తుల నుంచి పెద్దవాల్గోట్‌లో తాము గంజాయిని కొనుగోలు చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం..యశ్వంత్, నరేశ్ లను కూడా అరెస్ట్ చేసి వారి నుండి 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీ ఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.