గుడ్ న్యూస్ ప్రకటించిన బుల్లితెర నటి.. మా బేబీ వచ్చేసిందంటూ పోస్ట్

బుల్లితెర నటి సనా సయ్యద్ పలు సీరియల్స్‌లో నటించింది. ముఖ్యంగా ‘కుండలి భాగ్యతో ఫుల్ ఫేమస్ అయింది.

Update: 2024-10-10 15:09 GMT

దిశ, సినిమా: బుల్లితెర నటి సనా సయ్యద్ పలు సీరియల్స్‌లో నటించింది. ముఖ్యంగా ‘కుండలి భాగ్యతో ఫుల్ ఫేమస్ అయింది. ఇందులో పల్కీ పాత్రలో నటించి తన అందం, నటన, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఈ అమ్మడు కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే 2021లో ఇమాద్ షమ్సీని పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి కాస్త పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వెకేషన్స్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటోంది. ఇటీవల ప్రెగ్నెంట్‌ అయిన విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, సనా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ‘‘ 9-10-2024 వెల్‌కమ్ టూ బేబీ గర్ల్’’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 


Similar News