Vijay Devarakonda: రౌడీ హీరో ‘రౌడీ వేర్’ బ్రాండ్‌కు అరుదైన అవార్డ్.. దీనిపై విజయ్ దేవరకొండ రియాక్షన్ ఏంటంటే?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

Update: 2024-11-25 14:25 GMT
Vijay Devarakonda: రౌడీ హీరో ‘రౌడీ వేర్’ బ్రాండ్‌కు అరుదైన అవార్డ్.. దీనిపై విజయ్ దేవరకొండ రియాక్షన్ ఏంటంటే?
  • whatsapp icon

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ అతనికి రౌడీ హీరో (Rowdy Hero) అనే బిరుదు కూడా ఇచ్చారు. అయితే.. ఇదే బిరుదుతో విజయ్ ‘రౌడీ వేర్’ (Rowdy Wear) అనే క్లాతింగ్ బిజినెస్ (Clothing Business) స్టార్ట్ చేశాడు. తాజాగా ఈ బ్రాండ్‌కు ఓ అరుదైన గౌరవం దక్కింది. ‘రౌడీ వేర్’ బిజినెస్ స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఎంతో పాపులర్ అయింది. అంతే కాకుండా యూత్‌లో ఈ బ్రాండ్‌కున్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఔట్ లుక్ ఇండియా (Outlook India) నిర్వహించిన బిజినెస్ అవార్డ్స్ 2024లో ఐకానిక్ ఇండియన్ స్ట్రీట్ వేర్ బ్రాండ్ (Iconic Indian Street Wear Brand) అవార్డ్ ‘రౌడీ వేర్’ బ్రాండ్ గెల్చుకుంది. విజయ్ దేవరకొండ తరుపున ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) ఈ అవార్డ్ ప్రదానోత్సవంలో పాల్గొని బహుమతి స్వీకరించారు.

ఈ సందర్భంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా (Social Media) వేదికగా స్పందిస్తూ.. ‘రౌడీ వేర్‌ను ఐకానిక్ బ్రాండ్‌గా మార్చిన రౌడీస్‌తో పాటు రౌడీ వేర్ టీమ్‌కు థ్యాంక్స్. ఇలాగే సక్సెస్ ఫుల్‌గౌ రౌడీ వేర్‌ను ముందుకు తీసుకెళ్లాలి’ అంటూ కోరారు. కాగా.. స్టైలింగ్, మేకోవర్‌లో తనకున్న ప్యాషన్‌తో ‘రౌడీ వేర్’ బ్రాండ్‌ను ఎప్పటికప్పుడు సరికొత్తగా యూత్‌కు రీచ్ అయ్యేలా చేస్తున్నాడు విజయ్.

Read more...

Vikatakavi: ఈ సిరీస్ కచ్చితంగా నచ్చుతుంది.. ‘వికటకవి’ ప్రెస్ మీట్‌లో నిర్మాత కామెంట్స్


Tags:    

Similar News