ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఒకరు మృతి...
ప్రైవేట్ ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో గాయాలైన కార్మికుడు ఆస్పత్రిలో మృతి చెందిన ఘటన దుబ్బాక పట్టణ శివారులో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది

దిశ,దుబ్బాక : ప్రైవేట్ ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో గాయాలైన కార్మికుడు ఆస్పత్రిలో మృతి చెందిన ఘటన దుబ్బాక పట్టణ శివారులో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందిన దేవా (35) అనే కార్మికుడు దుబ్బాకలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్, హోటల్లో పనిచేస్తూ శివారులో జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు దుబ్బాకలో విధులు ముగించుకొని తాను ఉంటున్న గదికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అక్కడే వాషింగ్ కేంద్రంలో బస్సును కడిగించుకొని అనూహ్యంగా రివర్స్ తీస్తున్న క్రమంలో బస్సును బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన దేవాను 108 సిబ్బంది సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. మృతుని భార్య ఇద్దరు పిల్లలు ఒడిశాలో ఉన్నారు. ఈ ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేని దుబ్బాక పోలీసులు తెలిపారు.