మాజీ సీఎం పై ప్రత్యేక క్రిమినల్ కేసు..?
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప పై ప్రత్యేక క్రిమినల్ కేసు నమోదు చేయాలని latest telugu news..
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప పై ప్రత్యేక క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 2006-2007 సంవత్సరంలో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు భూ డీనోటిఫికేషన్ కేసులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలతో కోర్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఐటీ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం 434 ఎకరాల భూమిని సేకరించింది. అయితే దానిని యడ్యూరప్ప ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా డీనోటిఫై చేశారని ఫిర్యాదు దారు ఆరోపించారు.