Shagun Sharma: అతనితో పడుకోవడానికి మా తల్లిదండ్రులే కారణం.. యంగ్ బ్యూటీ
దిశ, సినిమా : ప్రముఖ మోడల్, టెలివిజన్ నటి షగున్ శర్మ బోల్డ్ రోల్ ఆఫర్‌పై ఫ్యామీలీ రియాక్షన్ గురించి తెలిపింది.
దిశ, సినిమా : ప్రముఖ మోడల్, టెలివిజన్ నటి షగున్ శర్మ బోల్డ్ రోల్ ఆఫర్‌పై ఫ్యామీలీ రియాక్షన్ గురించి తెలిపింది. తాజాగా తన కొత్త షో 'హర్ పల్ మోహినీ'కి సంబంధించిన ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న నటి.. బోల్డ్ సీన్స్ చేయాల్సి వచ్చినపుడు తన కంటే ఎక్కువగా తల్లిదండ్రులే అర్థం చేసుకున్నారని తెలిపింది. 'ఒక వెబ్ సిరీస్ ప్రాజెక్ట్‌లో భాగంగా అబ్బాయితో బెడ్‌పై రొమాన్స్, ముద్దు సన్నివేశం ఉందని మేకర్స్ చెప్పారు. ఆ సమయంలో చెయ్యాలా వద్దా అని డైలమాలో పడ్డాను. మా పేరెంట్స్‌తో మాట్లాడినప్పుడు వారు చెప్పిన విషయంతో ఆశ్చర్యపోయాను. సౌకర్యవంతంగా అనిపించే నీ వృత్తిలో నిర్భయంగా ముందుకు సాగాలి. అలాంటివి మేము చూడటం నీకు అసౌకర్యంగా అనిపిస్తే.. మేము అసలు చూడము. కానీ, మా కారణంగా నీ ఎదుగుదలను ఆపేందుకు ప్రయత్నించకు'అని చెప్పినట్లు వివరించింది. ఇక చివరగా ఒకసారి ప్రమోషన్ పొందిన ఎవరైనా డిమోషన్ అంగీకరించరని, అందుకే ఒత్తిడి పెంచుకోకుండా ప్రతి సన్నీవేశంలో వంద శాతం బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది.