సెన్సోడైన్ టూత్‌పేస్ట్‌పై రూ.10 లక్షల ఫైన్

న్యూఢిల్లీ: తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు సెన్సోడైన్ టూత్‌పేస్ట్‌పై latest telugu news..

Update: 2022-03-22 13:58 GMT

న్యూఢిల్లీ: తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు సెన్సోడైన్ టూత్‌పేస్ట్‌పై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ చర్యలకు దిగింది. ఈ మేరకు తయారీ సంస్థ పై రూ.10 లక్షల జరిమానా విధించింది. వారం రోజుల్లో సంబంధిత అన్ని ప్రకటనలు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డెంటిస్టులు ప్రతిపాదన, ప్రపంచంలోని నెం.1 సెన్సిటివిటీ టూత్‌పేస్ట్‌గా పేర్కొంటున్న ప్రకటనలు నిలిపివేయాలని అందులో పేర్కొంది.

సీసీపీఏ ఆదేశాల ప్రకారం విదేశీ దంతవైద్యుల ఆమోదాలను చూపించే ప్రకటనలను నిలిపివేయాలని తెలిపింది. కాగా గతంలో సెన్సోడైన్ టూత్ పేస్ట్ విదేశీ డాక్టర్లచే ధృవీకరించబడిందనే వాదనలపై నిషేధం విధించింది. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డెంటిస్టుల ప్రతిపాదన, ప్రపంచపు నెం.1 సెన్సిటివిటీ టూత్ పేస్ట్ వంటి ప్రకటనలపై ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా టీవీ, యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో ప్రకటనలపై ఆంక్షలు ఉంటాయని తెలిపింది.

Tags:    

Similar News