Breaking News : హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు క్వాష్ పిటిషన్లు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS Leader KCR), సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(MLA HarishRao) హైకోర్టులో క్వాష్ పిటిషన్లు(Quash Petitions) దాఖలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS Leader KCR), సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(MLA HarishRao) హైకోర్టులో క్వాష్ పిటిషన్లు(Quash Petitions) దాఖలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) నిర్మాణంలో అవినీతి జరిగిందనే అంశంపై భూపాలపల్లిలో కేసు నమోదు అయింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని భూపాలపల్లి కోర్టులో ఓ ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు కేసీఆర్, హరీష్ రావులకు గత జూలైలో నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ వారిద్దరూ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు.
Read More..
Kavitha: రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి.. కామారెడ్డి రైతుల విషయంలో కవిత విమర్శలు