Winter: చలికాలంలో యోని సమస్యలు తలెత్తడానికి కారణాలు..!
చలికాలంలో సాధారణంగానే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి
దిశ, వెబ్‌డెస్క్: చలికాలంలో సాధారణంగానే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వింటర్‌లో మహిళల యోనిపై కూడా ప్రభావం చూపుతుంది. చర్మంలో తేమ శాతం తగ్గినప్పుడు.. శరీరంలోని మిగిలిన అవయవాల మాదిరిగానే యోనిని ప్రభావితం చేస్తుంది. దీన్నే వింటర్ వెజైనా అని అంటారు. వింటర్ వెజైనా లక్షణాలు చూసినట్లైతే..
యోని ఎరుపు రంగులోని మారిపోవడం, యోనిలో మంట, పొడిబారడం, దురద, యోని కుంచించుకుపోవడం, వాపు, మూత్ర విసర్జన చేసేప్పుడు తీవ్రమైన నొప్పి, యోనిలో చికాకుగా ఉండటం, యోని సంక్రమణ వంటివి వెజెనా లక్షణాలు.
శీతాకాలంలో యోని సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయో ఇప్పుడు చూద్దాం. వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేటెడ్‌గా ఉండదు. దీంతో చర్మం పొడిబారి.. మహిళల్లో యోని కూడా పొడిబారుతుంది. అలాగే యోనిలో తగినంత తేమ లేకపోవడం ఒకటి. కాగా ఈ సమస్యను నివారించాలంటే రోజూ శరీరానికి కావాల్సినంత వాటర్ తీసుకోవాలి.
యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫిట్‌గా ఉండే దుస్తులు ధరించకూడదు. బిగుతుగా ఉన్న బట్టలు వేసుకుంటే యోనికి గాలి అందక.. యోని ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. చలికాలంలో కాటన్ ప్యాంటీలు వేసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే యోని పొడిబారకుండా ఉండేందుకు కొబ్బరి ఆయిల్ వాడడం మేలు. తాజా పండ్లు, కూరగాయలను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. జంక్ ఫుడ్ తినడం తగ్గించాలి. జంక్ ఫుడ్ యోని పిహెచ్ స్థాయిలకు భంగం కలిగిస్తుంది. యోని వద్ద దురద, మంట, పొడిబారడం, చికాకు వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి.
అలాగే పీరియడ్స్ టైంలో ప్యాడ్‌ను టైమ్‌కు ఛేంజ్ చేయాలి. లేకపోతే యోని వద్ద ఇన్ఫెక్షన్, అలెర్జీలు, పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాగా శుభ్రత పాటించాలి. యోని ఆరోగ్యంగా ఉండాలంటే వేడి వాటర్ ఎక్కువగా వాడొద్దు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
Read More ...
Irregular periods: పీరియడ్స్ టైంకు రాకపోవడానికి మీకుండే ఈ 5 సమస్యలే కారణం..?