ఖర్జూరాలతో బోలెడు లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు.!
దిశ, ఫీచర్స్: మినరల్స్, చక్కెర, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ప్రయోజనకరమైన విటమిన్లకు ఖర్జూరం కేరాఫ్ అడ్రస్.
దిశ, ఫీచర్స్: మినరల్స్, చక్కెర, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ప్రయోజనకరమైన విటమిన్లకు ఖర్జూరం కేరాఫ్ అడ్రస్. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండి శరీరానికి తక్షణ ఎనర్జీని అందించగలదు. వీటిని డైలీ తినడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, కొలెస్ట్రాల్, స్ట్రోక్ తదితర అనారోగ్య పరిస్థితులను నివారించవచ్చు. నేచురల్ షుగర్స్ కలిగి ఉండే ఖర్జూరాలను డయాబెటిస్ పేషెంట్స్‌కు ప్రకృతి ప్రసాదించిన వరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డేట్స్ తింటే చక్కెర వ్యాధిగ్రస్తుల షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
ఉపయోగాలు..
* మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరగాలంటే ఖర్జూరాలు తరచూ తినాలి. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ తదితర సమస్యలతో బాధపడేవారు ఈ పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనికి రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. కనుక రక్తహీనత, నీరసంతో బాధపడుతున్నవారు ఖర్జూర పండ్లను పాలు, మీగడ లేదా కొద్దిగా నెయ్యి కలిపి ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే మంచిది. అంతేకాదు రక్తం తక్కువగా ఉండేవారు రోజూ ఖర్జూరా పండు తీసుకుంటే బెటర్.
* ఖర్జూరా పండ్లలోని 'ఏ, బీ' విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి. ఇందులోని పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎముకల పటుత్వానికి దోహదపడతాయి. కండరాల సమస్యలతో పాటు హ్యాంగోవర్‌ను తగ్గించడంలోనూ ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి.
* ప్రతి రోజూ ఒకటి రెండు నానబెట్టిన డేట్స్ తినడం వల్ల బాడీకి ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. విటమిన్ సప్లిమెంట్ తీసుకునే అవకాశం ఉండదు. దంతాలను ఆరోగ్యంగా ఉంచే ఫోరిన్ మాత్రమే కాకుండా వీటిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఐరన్ లోపంతో బాధపడే వారు ఖర్జూరాలను ఎక్కువగా తీసుకోవాలి.
* ఇక డేట్స్‌లో ఉండే విటమిన్ సి, డి వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
* అధిక బరువును ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించడంలో ఖర్జూరాలది కీలక పాత్ర.