హెచ్సీఏ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన అక్రమాలపై సెప్టెంబర్ 18వ తారీకున భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు.

Update: 2024-12-24 14:02 GMT

దిశ,ఉప్పల్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన అక్రమాలపై సెప్టెంబర్ 18వ తారీకున భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు. దాంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై దాడులు నిర్వహించారు. అక్రమ టెండర్ల ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో రవాణా, క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇవ్వడంలో కొందరు హెచ్‌సీఏ సభ్యులు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. హెచ్సీఏ ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు సమాచారం.


Similar News