బెదిరించిన కేసులో వ్యక్తి రిమాండ్​

నిర్మాణదారుడిని బెదిరించిన కేసులో పోలీసులు వ్యక్తిని రిమాండ్​ కు తరలించారు.

Update: 2024-12-24 16:37 GMT

దిశ, కూకట్​పల్లి : నిర్మాణదారుడిని బెదిరించిన కేసులో పోలీసులు వ్యక్తిని రిమాండ్​ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్​బీ కాలనీకి చెందిన పవన్​ కుమార్​ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు జంగాల నాగార్జునను మంగళవారం రిమాండ్​కు తరలించారు. నాగార్జున, మరొక వ్యక్తితో కలిసి పవన్​ కుమార్​ను డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. దాంతో పవన్​ కుమార్​ ఈనెల 18వ తేదీన కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. 


Similar News