గంజాయి తరలిస్తున్న యువకుడు అరెస్ట్

గంజాయి తరలిస్తున్న యువకుడిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు.

Update: 2024-12-24 15:56 GMT

దిశ, గొల్లపల్లి : గంజాయి తరలిస్తున్న యువకుడిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లొత్తునూరు గ్రామానికి చెందిన లక్కం అజయ్ అనే వ్యక్తి గంజాయి సరఫరా చేస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు గొల్లపల్లి గ్రామ శివారులోని వెనుగుమట్ల ఎక్స్​ రోడ్డు వద్ద అజయ్ ని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న 200 గ్రాముల గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై సతీష్, పోలీస్ సిబ్బంది తిరుపతి, వేణు, పూర్ణ సాయి, సుదర్శన్, శ్రీను లను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.


Similar News