షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ
పెద్దవూర మండల కేంద్రంలో షాది ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుందూరు జై వీర్ రెడ్డి పంపిణీ చేశారు
దిశ,పెద్దవూర : పెద్దవూర మండల కేంద్రంలో షాది ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుందూరు జై వీర్ రెడ్డి పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డ వివాహం భారం కాకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రవేశ పెట్టిన పథకం చెక్కులను అర్హులైన వారికి అందజేశారు. వారి వెంట మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్ర శేఖర్ రెడ్డి, పెద్దవూర మండల పార్టీ అధ్యక్షుడు పబ్బు యాదగిరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గడ్డంపల్లి వినయ్ రెడ్డి, గడ్డంపల్లి రవీందర్ రెడ్డి, హలియా మార్కెట్ డైరెక్టర్ లక్ష్మయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు ముని లాల్ నాయక్, మాజీ సర్పంచ్ బిచ్చు నాయక్, మాజీ సర్పంచ్ శంకర్, పెద్దవూర మండలం ప్రధాన కార్యదర్శి కాంసాని కృష్ణయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి పులిచర్ల గ్రామపంచాయతీ బుడగపాక అశ్విత, కున్రెడ్డి కీర్తి, పగిల చిట్టి, జానపాటి అశ్విని, కోరిక శ్రీలత, పేర్ల స్వాతి, చిమట రాధిక, రమావత్ వెన్నెల, బాణావత్ శిరీష, పానుగోతు కళ్యాణి ,కొర్ర మౌనిక, కొర్ర శైలులకు చెక్కులు అందించడం జరిగింది.