ఐరన్ వేస్ట్‌తో రహదారి.. దేశంలో తొలి ప్రయోగం సక్సెస్

అహ్మదాబాద్ : దేశంలో తొలిసారి ఐరన్ వేస్ట్‌ను ఉపయోగించి చేపట్టిన రహదారి నిర్మాణం..latest telugu news

Update: 2022-03-26 16:43 GMT

అహ్మదాబాద్ : దేశంలో తొలిసారి ఐరన్ వేస్ట్‌ను ఉపయోగించి చేపట్టిన రహదారి నిర్మాణం విజయవంతమైంది. భారత్‌లో ప్రతియేటా వివిధ ప్లాంట్ల ద్వారా 19 మిలియన్ టన్నుల ఉక్కు వ్యర్థాలు వెలువడుతుండగా వీటిని ఉపయోగించి తొలిసారిగా రహదారుల నిర్మాణం చేపట్టాలని సీఎస్ఐఆర్, సీఆర్ఆర్ఐ నిర్ణయించాయి. నీతి ఆయోగ్ సహాయంతో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ పాలసీ కమిషన్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును తొలిసారిగా గుజరాత్‌లోని సూరత్ నగరంలో గల హజీరా పారిశ్రామిక ప్రాంతం వద్ద ఉక్కు వ్యర్థాలతో ఒక రహదారిని నిర్మించారు.

ఈ ప్రాజెక్ట్ భారత ప్రభుత్వం యొక్క వేస్ట్ టు వెల్త్, క్లీన్ ఇండియా క్యాంపెయిన్‌ను కూడా ట్యాప్ చేస్తుంది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా 1 కిలోమీటరు పొడవు, 6-లేన్ హైవేను 100 శాతం ప్రాసెస్ స్టీల్, కంకరను ఉపయోగించి తయారు చేశారు. సీఎస్ఆర్ఐ ప్రకారం రహదారి మందం కూడా 30 శాతం తగ్గింది. అయితే, ఈ కొత్త పద్ధతి వలన వర్షాకాలంలో రోడ్లకు ఎలాంటి నష్టం జరగకుండా నివారించవచ్చని భావిస్తున్నారు. గతంలో భారీ ట్రక్కుల వలన పాడైన రోడ్డుపై ఈ కొత్త రహదారి నిర్మాణం చేపట్టగా ప్రతిరోజూ 18 నుంచి 30 ట్రక్కులు టన్నుల లోడ్‌తో ప్రయాణిస్తున్నాయి. కానీ రహదారి మాత్రం పాడవ్వలేదని సీఆర్ఆర్ఐ ప్రిన్సిపల్ సైంటిస్ట్ సతీష్ పాండే వెల్లడించారు. భవిష్యత్‌లో హైవేలు, ఇతర రోడ్ల నిర్మాణంలో ఐరన్ వేస్ట్ వాడటం వలన ఖర్చు కూడా దాదాపు 30 శాతం తగ్గుతుందని పాండే తెలిపారు.

Tags:    

Similar News