పీజీ మెడికల్ ప్రవేశాలకు మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల..

దిశ, తెలంగాణ బ్యూరో: పీజీ మెడికల్‌ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజి హెల్త్‌ యూనివర్సిటీ ‌మంగళవారం- latest Telugu news

Update: 2022-03-22 15:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పీజీ మెడికల్‌ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ‌మంగళవారం మాప్ అప్ నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలు, నిమ్స్‌ మెడికల్‌ కళాశాలలోని కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పీజీ కటాఫ్ స్కోర్ తగ్గిన నేపథ్యంలో సర్వీస్ కేటగిరి అభ్యర్థులకు ఈ సారి అవకాశం కల్పించారు. సర్వీస్ నాన్ సర్వీస్ సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్‌లో పొందుపరిచారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 2గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారిగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inలో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News