Pushpa 2 : ట్రైలర్ సక్సెస్ తర్వాత సంబరాలు చేసుకుంటున్న పుష్ప 2 టీమ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా, సుకుమార్ ( Sukumar) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2.

Update: 2024-11-19 06:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా, సుకుమార్ ( Sukumar) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని బన్నీ ఫ్యాన్స్ తో సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం ఈ సినిమాకి ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం, నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఇప్పటికీ , యూట్యూబ్ లో ట్రెండింగ్ లోనే ఉంది. మిలియన్ల కొద్ది వ్యూస్ తో రావడంతో మూవీ టీమ్ పండుగ చేసుకుంటున్నారు.

తాజాగా, పుష్ప 2 ట్రైలర్ చూసాక సూపర్ అంటూ పుష్ప మూవీ టీమ్ ని లిరిసిస్ట్ చంద్రబోస్ కలిశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లతో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. ‘వైల్డ్ ఫైర్’ అని తన ట్విట్ చేశాడు. దీంతో చంద్రబోస్ చేసిన ఈ పోస్ట్ ను ఫ్యాన్స్ , నెటిజన్స్ షేర్ చేస్తూ నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు.


Read More...

Pushpa 2: పాట్నా ఈవెంట్‌కు మించి బెంగుళూరులో పుష్ప 2 ఈవెంట్‌?

Tags:    

Similar News