‘టచ్‌లో ఉండూ’ సాంగ్ ఆ స్టార్ హీరో చేతుల మీదుగా లాంచ్.. ప్రదీప్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika pilli) జంటగా నటిస్తోన్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi).

Update: 2024-12-25 02:22 GMT

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika pilli) జంటగా నటిస్తోన్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi). ఇక ఈ చిత్రాన్ని నితిన్(Nithin), భరత్‌(Bharath)లు తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఆకట్టుకున్నాయి. అయితే, తాజాగా ఇందులోంచి సెకెండ్ సింగిల్‌(Second Single) రాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే ‘టచ్‌లో ఉండూ ’ అనే సాంగ్‌‌ను డిసెంబర్ 25న విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా సాయంత్రం 4.15 నిమిషాలకు లాంచ్ చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ప్రదీప్ మాచిరాజు ప్రస్తుతం వరుస సినిమాలతో మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. అయితే ప్రదీప్ గతంలో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా మంచి మార్కులే కొట్టేశాడు. మరి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీతో కూడా హిట్ కొడతాడో లేదో తెలియాలంటే ఈ చిత్రం రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News