దిశ, సినిమా: ప్రభాస్, పూజాహెగ్డే కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'రాధేశ్యామ్'. మార్చి 11న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్.. పూజాతో క్లోజ్ సీన్లు చేయడం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'పూజాతో లిప్ లాక్ సీన్ చాలా కష్టంగా అనిపించింది. నా కేరిర్‌లో ఇప్పటివరకూ ఇలాంటి సన్నివేశం చేయలేదు.
రాధేశ్యామ్ రొమాంటిక్ మూవీ కాబట్టి.. ఇందులో రొమాన్స్ కూడా కాస్త ఎక్కువే. అయితే అందరి ముందు ముద్దు, ఇతరత్ర సన్నివేశాలు చేయాలంటే చాలా సిగ్గనిపించింది. సెట్‌లో ఎవరు లేకుండా ఒక ప్రైవేట్ ప్లేస్‌లో చేస్తానని దర్శకుడు రాధాకృష్ణ చెప్పాను. దానికి ఓకే చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే పూజాతో ముద్దు సీన్లన్నీ ఓ రహస్య ప్రదేశంలో తెరకెక్కించారని చెప్పిన ప్రభాస్.. షర్టు లేకుండా నటించడం పెద్ద సవాలుగా మారిందన్నాడు.