Sreeja-Kalyaan Dhev: ఆమె జ్ఞాపకాల్లో మెగా అల్లుడు.. ఎమోషనల్ వీడియోను షేర్ చేసిన శ్రీజ భర్త

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ(Sreeja Konidela) సినిమాల్లో నటించనప్పటికీ తన పర్సనల్ లైఫ్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుందనడంలో అతిశయోక్తి లేదు.

Update: 2024-11-15 10:50 GMT

దిశ, సినిమా: చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ(Sreeja Konidela) సినిమాల్లో నటించనప్పటికీ తన పర్సనల్ లైఫ్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుందనడంలో అతిశయోక్తి లేదు. ఆమె శిరీష్ భరద్వాజ్‌(Shirish Bhardwaj)ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. అప్పట్లో ఈ సంఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అయితే ఇదంతా చిరు (Chiranjeevi) పొలిటికల్ ఎంట్రీకి ముందు జరగడంతో దుమారం రేపింది. దీంతో మెగా ఫ్యామిలీ, అభిమానులంతా చాలా బాధపడ్డారు. అయితే శ్రీజ, శిరీష్‌కు ఓ కూతురు పుట్టాక మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయింది.

2014లో తనను శిరీష్ వేధిస్తున్నాడని, అదనపు కట్నం డిమాండ్ చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆరోపించడంతో ఈ కామెంట్స్ నెట్టింట వివాస్పదంగా మారాయి. ఇక అప్పుడు చిరంజీవి ఇంటికి రావడంతో కూతురి బాధ చూడలేక 2016లో వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్‌(Kalyaan Dhev)తో శ్రీజ పెళ్లి జరిపించారు. అయితే వీరికి నవిష్క(Navishka) జన్మించింది. కానీ వీరి కాపురం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. దురదృష్టవశాత్తూ శ్రీజ(Sreeja Konidela), కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు.

ఇక కళ్యాణ్ దేవ్ మాత్రం శ్రీజతో విడాకులు తీసుకున్నప్పటికీ కూతురు నవిష్కను ఇంటికి తీసుకెళ్లి సమయం గడుపుతూ పలు వీడియోలను నెట్టింట షేర్ చేస్తున్నాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆయన ఎలాంటి పోస్ట్ పెట్టకుండా ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నాడు. తాజాగా, మరోసారి తన కూతురు వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. బాలల దినోత్సవం(Children's Day) సందర్భంగా కూతురిని తలుచుకుంటూ నవిష్కతో ఉన్న వీడియోను షేర్ చేసి తనని మిస్ అవుతున్నట్లు తెలియజేశాడు. కూతురిని కౌగిలించుకుని బాధపడ్డాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.


Read More..

Chiranjeevi: జపాన్‌లో చిరంజీవి.. 10 రోజుల పాటు అక్కడే ఉండనున్న మెగాస్టార్!


Tags:    

Similar News