'యాదాద్రి వేడుకలు.. గవర్నర్ తమిళిసైకి అవమానం'

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : యాదగిరిగుట్టలో జరుగుతున్న వేడుకలకు ప్రతిపక్ష..latest telugu news

Update: 2022-03-28 13:44 GMT

 దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత పొలంలో, సొంత ఖర్చులతో యాదగిరిగుట్ట ను నిర్మించాను అన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.

ప్రాచీన చరిత్ర ఉన్న యాదగిరిగుట్ట ను యాదాద్రి గా మార్చి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఆలయ పునర్నిర్మాణం రోజున సొంత పార్టీ వాళ్ళను మినహాయించి ఎవరిని పిలవలేదు.. ప్రారంభోత్సవం రోజున రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ను ఆహ్వానించకుండా అవమాన పరచాలని డీకే అరుణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలు హోదాలో ఉన్న మహిళను ఆహ్వానించకపోవడం.. రాష్ట్ర మహిళల అందరిని అవమానించడమే అన్నారు. గవర్నర్ ను గౌరవించలేని ముఖ్యమంత్రి కేసీఆర్ పదవిలో ఉండడానికి ఎంత మాత్రం అర్హుడు కాదని డీకే అరుణ పేర్కొన్నారు. యాదగిరిగుట్ట పేరు యాదాద్రి కాకుండా యాదగిరిగుట్ట గానే కొనసాగాలని ఆమె డిమాండ్ చేశారు.

Tags:    

Similar News