ఎల్లప్పుడూ అండగా ఉండి నాకు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
శనివారం రాజమహేంద్రవరంలో ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: శనివారం రాజమహేంద్రవరంలో ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గెస్ట్‌గా హాజరయ్యారు. అక్కడ పవన్.. రామ్ చరణ్(Ram Charan) పై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కాగా శంకర్(Director Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా రామ్ చరణ్ ఎక్స్(X) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. అందులో పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్‌పై భుజం మీద చేయి వేసి ఉన్న పిక్, అండ్ చరణ్ గురించి మాట్లాడుతున్న ఫొటో, అలాగే చరణ్‌ని దగ్గరకి తీసుకొని మరీ పొగుడుతున్న ఫొటో ఇలా మూడు పిక్స్‌లను షేర్ చేశాడు. అంతే కాకుండా వీటికి.. ‘ప్రియమైన ఉప ముఖ్యమంత్రి గారు, నేను మీ నెప్యూగా, నటుడిగా, గర్వించదగిన భారతీయుడిగా, మిమ్మల్ని ఎనలేని ప్రేమతో గౌరవిస్తాను. అలాగే ఎల్లప్పుడూ నాకు అండగా ఉండి మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు’ అంటూ నమస్కారం పెడుతున్న ఎమోజీని జోడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడిమాలో వైరల్‌గా మారగా.. బాబాయ్, అబ్బాయ్ జోడి చాలా బాగుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.