Jubilee Hills: హీరో అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి ఎస్ఐ

జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లోని అల్లు అర్జున్(Allu Arjun) నివాసం వద్ద మరోసారి హైడ్రామా చోటుచేసుకుంది.

Update: 2025-01-05 04:22 GMT
Jubilee Hills: హీరో అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి ఎస్ఐ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లోని అల్లు అర్జున్(Allu Arjun) నివాసం వద్ద మరోసారి హైడ్రామా చోటుచేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌(Chikkadapally Police)కు అల్లు అర్జున్ వెళ్లాల్సి ఉండగా.. రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ ఇంటి వద్ద ప్రత్యక్షం కావడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆదివారం ఉదయం అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి రాంగోపాల్ పేట ఎస్‌ఐ నోటీసులు జారీ చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరామర్శకు రావొద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. అంతకుముందు నోటీసులు ఎందుకు అని మేనేజర్ ప్రశ్నించగా.. పర్సనల్‌గా కలుద్దామని వచ్చినట్లు సమాధానం చెప్పకుండా ఎస్ఐ దాటవేసినట్లు సమాచారం.

కాగా, ఇటీవలే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని షరతులు విధించింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

Tags:    

Similar News