Renu Desai: నా తల్లి చనిపోతే తప్పుగా మెసేజ్‌లు పెట్టారు.. రేణు దేశాయ్ పోస్ట్
టాలీవుడ్ నటి రేణు దేశాయ్(Renu Desai) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.
దిశ, సినిమా: టాలీవుడ్ నటి రేణు దేశాయ్(Renu Desai) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇటీవల ఆమె తల్లి మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా సంతాపం ప్రకటించడంతో పాటు ఆమెకు ధైర్యం చెబుతూ పలు పోస్టులు పెట్టారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘మా అమ్మ మంగళవారం చనిపోతే నా ఫ్రెండ్స్, నెటిజన్లు చాలా మంది సంతాపాన్ని ప్రకటించారు. కానీ అది చాలా తప్పు. అలా రిప్, రెస్ట్ ఇన్ పీస్(Rest in Peace) అని పెట్టకూడదు. హిందువులు చనిపోతే అలా రిప్ అని చెప్పకండి.
రిప్ అంటే ఆత్మకు విశ్రాంతి దొరకడం అని అర్థం. కానీ మన హిందూ ధర్మం ప్రకారం ఆత్మ ఎప్పుడూ ఒంటరిగా ఉండదు.. దానికి విశ్రాంతి(Rest) కూడా దొరకదు. సనాతన ధర్మం గురించి మాట్లుడుతున్న ఒక పండిట్ (Pandit)నుంచి రిప్, సద్గతి తేడా గురించి తెలుసుకున్నా. అయితే ఈ విషయాన్ని నేను నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో చెప్పాలనిపించి చెప్పా. అంతేకానీ ఎవరి నమ్మకాలను ఉద్దేశించి కాదు’’ అని రాసుకొచ్చింది.