బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే ఏమవుతుంది.. తప్పనిసరిగా టిఫిన్ చేయాలా?

దిశ, ఫీచర్స్ : 1960లలో అమెరికన్ పోషకాహార నిపుణుడు అడెల్లె డేవిస్.. ‘అల్పాహారం రాజులాగా, లంచ్‌ను యువరాజు మాదిరిగా, రాత్రి భోజనం పేదవాడిలాగా తినాలి’ అని సూచించాడు..Latest Telugu News

Update: 2022-06-28 08:04 GMT

దిశ, ఫీచర్స్ : 1960లలో అమెరికన్ పోషకాహార నిపుణుడు అడెల్లె డేవిస్.. 'అల్పాహారం రాజులాగా, లంచ్‌ను యువరాజు మాదిరిగా, రాత్రి భోజనం పేదవాడిలాగా తినాలి' అని సూచించాడు. ఫిట్‌గా ఉండేందుకు, స్థూలకాయాన్ని నివారించేందుకు.. అల్పాహారం ఆనాటి అత్యంత ముఖ్యమైన భోజనంగా పేరు పొందింది. ఇప్పటికీ చాలా మంది ఈ నమ్మకానికి కట్టుబడి ఉన్నా.. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు కూడా లెక్కకు మించే ఉన్నారని సమాచారం. నిజానికి అల్పాహారం సేవిస్తే రోజును శక్తివంతంగా, పోషణతో ప్రారంభించగలమని నమ్ముతుండగా.. బ్రేక్‌ ఫాస్ట్ నిజంగా అత్యంత ముఖ్యమైన భోజనమా? మానేస్తే ఎంత వరకు ప్రమాదం? పరిశోధనలు ఏం చెప్తున్నాయి? దీనిపై భిన్న వాదనలేంటి?

అల్పాహారం తీసుకునేందుకు మద్దతు :

అల్పాహారం తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని 2021 అధ్యయనం పేర్కొంది. ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేవారికి గుండె వ్యాధి, మధుమేహం, ఊబకాయం, అధిక రక్త పోటు, స్ట్రోక్, ఉదర ఊబకాయం, హార్ట్ రిలేటెడ్‌ డెత్స్‌కు సంబంధించిన ప్రమాదాలు తక్కువగా ఉంటాయని తెలిపింది. హృదయ, జీవక్రియ వ్యాధులు కూడా దరిచేరే ప్రమాదం తక్కువని పేర్కొంది.

ఇక 30,000 మంది నార్త్ అమెరికన్స్ డేటా విశ్లేషణ అల్పాహారాన్ని దాటవేసే వ్యక్తులు ముఖ్యమైన పోషకాలను కోల్పోవచ్చని చూపిస్తుంది. ఫోలేట్, కాల్షియం, ఇనుము,

విటమిన్ ఎ, విటమిన్లు B1, B2, B3, విటమిన్ సి, విటమిన్ డి వంటి అత్యంత సాధారణ పోషకాలు శరీరానికి అందకుండా ఉండే అవకాశముందని పేర్కొంది. మొత్తానికి 2017లో ప్రచురించబడిన అధ్యయనం అంతర్గత గడియారాన్ని సమయానికి నడిపేందుకు ఆల్పాహారం తినడం అవసరమని సూచించింది.

బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే బరువు పెరుగుతుందా?

తమ రోజును అల్పాహారంతో ప్రారంభించిన తర్వాత సంతృప్తికరంగా ఉన్నట్లు చాలా మంది నివేదించినప్పటికీ.. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసేవారు లేదా తీసుకునేవారు దాదాపు ఒకే విధమైన కేలరీలు తీసుకోవడంతో రోజును ముగిస్తున్నారని మరికొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి.

*4 నెలల పాటు నిర్వహించిన ఓ అధ్యయనం.. బరువు తగ్గడంపై అల్పాహారం ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అనే విషయంపై స్టడీ చేసింది. ఇందుకోసం అధిక బరువున్న 309 మందిపై చేసిన రీసెర్చ్.. మొత్తానికి అల్పాహారం తినకుండా ఉండటంతో పోలిస్తే, తినడం బరువు తగ్గడంపై గణనీయమైన ప్రభావాన్ని చూపదని పరిశోధకులు నిర్ధారించారు. అందుకే అల్పాహారం తినడం బరువు తగ్గే కారణం కాకపోవచ్చని, బరువు తగ్గడానికి బ్రేక్ ఫాస్ట్ సిఫార్సు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు పరిశోధకులు. ఇది వాస్తవానికి వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు.

*ఇక బ్రేక్ ఫాస్ట్ దాటవేయడం వల్ల మొత్తం రోజువారీ 252 కేలరీలు తగ్గించవచ్చని మరొక అధ్యయనం కనుగొంది. ఏది ఏమైనప్పటికీ, ఏదైనా భోజనం దాటవేయబడినప్పుడు అది మొత్తం ఆహార నాణ్యతను తగ్గిస్తుందని పరిశోధకులు గమనించారు. ఫైనల్‌గా అల్పాహారం తీసుకోవడం బరువు పెరగడంతో ముడిపడి ఉందని ఎటువంటి బలమైన ఆధారాలు కనిపించడం లేదు.

అల్పాహారం తినే వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నారా?

2018 అధ్యయనం ప్రకారం.. తరచుగా అల్పాహారం తినే వారు పోషకాలు తీసుకోవడంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొంటారు. ఒత్తిడిని తగినంతగా నిర్వహిస్తారు. ఇక బ్రేక్‌ఫాస్ట్‌పై కాన్సంట్రేషన్ లేనివారు తరచుగా ధూమపానం, మద్యపానం వంటి అనారోగ్యకరమైన అలవాట్లను కలిగి ఉంటారు. కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ మాత్రమే ఆరోగ్య స్థితికి దోహదం చేస్తాయని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి.

అల్పాహారం‌లో ఏం తీసుకోవాలి?

* గుడ్లు

* ఓట్ మీల్

* పెరుగు

* బెర్రీస్

* హోల్ గ్రెయిన్ టోస్ట్

* చియా విత్తనాలు

* కాటేజ్ చీజ్

* అవకాడో

* నట్స్

ఏది బాగా పనిచేస్తుందో తెలుసుకోండి?

ఇటీవలి పోషకాహార పరిశోధనలు, ఆహారం విషయానికి వస్తే ఒకే పరిమాణానికి సరిపోయే విధానం లేదని స్పష్టం అవుతూనే ఉంది. సరైన ఆరోగ్యాన్ని సాధించడంలో ముఖ్యమైనది ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం.

* వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ

* వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు అన్ని ప్రధాన కండరాల సమూహాలకు శక్తినిచ్చే ఎక్సర్‌సైజ్

* ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి

* చక్కెర, కొవ్వు, ప్రాసెస్ చేయబడిన ఆహారాన్ని పరిమితం చేయాలి

* వివిధ రకాల పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి

* శరీరం, ఆకలి సూచనలపై శ్రద్ధ వహించాలి

* పుష్కలంగా నీరు త్రాగాలి

* పొగాకు ఉత్పత్తులు, అధిక ఆల్కహాల్ సేవించడం మంచిది కాదు.

* రోజుకు కనీసం 7 గంటల నిద్ర అవసరం


Similar News