సమయ పాలన పాటించని విద్యుత్ అధికారులు, సిబ్బంది

ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుంది.

Update: 2024-11-27 16:49 GMT

దిశ తొమ్మాజీపేట: ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుంది.కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు  రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అమలు చేస్తుంది. విద్యుత్ అధికారుల, సిబ్బంది తీరు చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని దుకాణదారులు, వ్యాపారస్తులు,మీసేవ,ఆన్ లైన్ సెంటర్,జిరాక్స్ సెంటర్ నిర్వాహుకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సిబ్బంది సమయ పాలన పాటించకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా ఇబ్బందులు పెడుతున్నారని తొమ్మాజీపేట స్థానికులు వాపోతున్నారు.  కనీసం ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 


Similar News