పీఎఫ్ ఎల్ఐసీ నుంచి రావాల్సిన డబ్బులు చెల్లించండి
కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ నుంచి తనకు రావాల్సిన ఎల్ఐసి డబ్బులు తనకు చెల్లించాలని విశ్రాంత ఉద్యోగి వెంకటయ్య పీఎఫ్ నోడల్ అధికారికి మొరపెట్టుకున్నాడు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ నుంచి తనకు రావాల్సిన ఎల్ఐసి డబ్బులు తనకు చెల్లించాలని విశ్రాంత ఉద్యోగి వెంకటయ్య పీఎఫ్ నోడల్ అధికారికి మొరపెట్టుకున్నాడు. ప్రతి నెల 27 న పీఎఫ్ ఖాతాదారుల సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో నిర్వహించే 'నిధి ఆప్కే నికాత్ 2.0' కార్యక్రమం బుధవారం జిల్లా కేంద్ర సమీపంలో ఉన్న అప్పన్నపల్లి లోని హుడ్యాయ్ షో రూం లో జరిగింది. తాను గత 2021 జనవరిలో హౌసింగ్ కార్పొరేషన్ లో డ్రైవర్ గా రిటైర్డ్ అయ్యానని,సర్వీసులో ఉన్నపుడు పీఎఫ్ ఎల్ఐసి చేశానన్నారు. రిటైరైయ్యాక తనకు రావాల్సిన లక్షా ఆరు వేల రూపాయల ఎల్ఐసి డబ్బులను చెల్లించాలి గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ బర్కత్ పురా పీఎఫ్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి ప్రాధేయపడినా చెల్లించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగి వెంకటయ్య కు రావాల్సిన ఎల్ఐసీ డబ్బుల విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి..చెల్లించేలా ప్రయత్నిస్తానని జిల్లా పీఎఫ్ నోడల్ అధికారి ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇకనైనా పీఎఫ్ ఖాతాదారుల సమస్యలను వెంటనే పరిష్కరం జరిగేలా చూడాలని పలువురు ఖాతాదారులు వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సెక్యూరిటీ అసిస్టెంట్లు పరమేశ్వర్,హరీష్ శర్మ,ఈఎస్ఐ బ్రాంచ్ మేనేజర్ అరబ్ అనీస్, సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు