Samantha: సమంత ఆ భాష మాట్లాడటం చూసి షాక్ అయ్యాను.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
టాలీవుడ్ ప్రముఖ నటి సమంత త్వరలో సిటాడెల్: హనీ బన్ని అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నటి సమంత త్వరలో సిటాడెల్: హనీ బన్ని అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ అండ్ డీకే రూపొందించిన ఈ సిరీస్ తో వరుణ్ ధావన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఇది అమెజాన్ ప్రైమ్ వేదికన నవంబర్ 7 వ తారీకున స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ నేపథ్యంలో టీమ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సిరీస్ బృందం ఓ ఇంగ్లీషు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే మాట్లాడుతూ.. ఫస్ట్ ఈ సిరీస్ కోసం సమంతను తీసుకోవాలని అనుకోలేదని వెల్లడించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాకనే వరుణ్ ను హీరోగా సెలక్ట్ చేశామని తెలిపారు.
తర్వాత హీరోయిన్ ఎవరైతే బాగుంటుందని ఆలోచించామని అన్నారు. హీరోకు హిందీ బాగా వస్తుంది కాబట్టి హిందీ వచ్చిన ఆమె అయితే బాగుంటుందని అనుకున్నామని పేర్కొన్నారు. ది ఫ్యామిలీ మ్యాన్-2 షూటింగ్ లో సమంత హిందీ మాట్లాడలేదని.. దీంతో తనను వద్దు అనుకున్నామని అన్నారు. కానీ ఓ రోజు సామ్ హిందీ చక్కగా మాట్లాడటం చూసి నిజంగా షాక్ అయ్యానంటూ వెల్లడించారు. సామ్ అంతా హిందీ అంత స్పష్టంగా ఎలా మాట్లాడిందో అంటూ ఆశ్చర్యకర కామెంట్లు చేశారు.
ఇక వెంటనే సిటాడెల్ కోసం సమంతను ఎంపిక చేసుకున్నామని వివరించారు. తర్వాత సమంత మాట్లాడుతూ.. తనకు హిందీ వచ్చునని కానీ మాట్లాడుతుంటే లోపాలుంటాయేమోనని భయంతో అందరిముందు స్టేజీపై ఎప్పుడు హిందీ మాట్లాడనని వెల్లడించింది. ఇక హీరో వరుణ్ స్పందించి.. ‘సామ్ వెరీ టాలెంటెడ్.. ఈ కథ నా వద్దకు వచ్చినప్పుడు సమంత కథానాయిక అయితే బాగుంటుందని ముందే అనుకున్నానని తెలిపాడు. ఆమె అయితేనే పాత్రకు పూర్తి న్యాయం చేయగలదని అనిపించింది అని అన్నాడు. ఈ సిరీస్ లో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగుందని పేర్కొన్నాడు.
Read More : అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్టార్ట్ అయిన చైతన్య- శోభితల పెళ్లి పనులు.. ఫొటోలు వైరల్