Naga Manikanta : నా ఆరోగ్యమే నాకు ముఖ్యం.. బిగ్ బాస్ నుంచి బయటొచ్చాక షాకింగ్ వ్యాఖ్యలు చేసిన నాగమణికంఠ
ప్రతీ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే
దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం ఎవరికీ అర్ధం కాకుండా ఉంది. ప్రతీ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే అయితే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగ మణికంఠ ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. ఇప్పుడు, ఈ ఎలిమినేషన్ పై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. నాగ మణికంఠ స్వయంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ బిగ్ బాస్ ని అడిగాడు. దీంతో నాగార్జున ఓటింగ్ తో సంబంధం లేకుండా నాగ మణికంఠను ఎలిమినేట్ చేసాడని వార్తలు వస్తున్నాయి.
ఆదివారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో నాగ మణికంఠ, గౌతమ్ ఉండగా నాగమణికంఠ ముందుగా ఓపెన్ అయి వెళ్ళిపోతాను అన్నాడు. అలాగే ఇంటి సభ్యులను కూడా నాగ్ అడగగా నాగమణికంఠని ఎలిమినేట్ చేయమని చెప్పారు. అలా ఇతను ఎలిమినేట్ అయ్యాడు.
నాగమణికంఠ బ్యాగ్ ప్యాక్ చేసుకుని స్టేజిపైకి వచ్చాక మరి నీకు ఓట్లు జనాలకు నువ్వు ఏం చెప్తావు అని నాగ్ అడగగా " నాకు ఓట్లు వేసిన అందరికీ పెద్ద సారీ. ముందు ముందు నేను మీ అందర్ని ఏదో రకంగా ఎంటర్టైన్ చేస్తాను. ఇప్పుడు నా హెల్త్ నాకు ముఖ్యం. లక్ష్మీదేవి కన్నా ఆరోగ్యమే ముఖ్యం అందుకే బయటకు వచ్చేసా " అని చెప్పాడు.