దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు
జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి దావోస్‌లో పర్యటించనున్నారు.
దిశ, వెబ్ డెస్క్: జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇద్దరు కలిసి దావోస్‌లో పర్యటించనున్నారు. వచ్చే నెల 20 నుంచి దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం(World Economic Forum) వార్షిక సదస్సు(Annual conference) జరగనుంది. ఈ సదస్సుకు హాజరు కావాల్సిందిగా తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మహారాష్ట్ర సీఎం(CM of Maharashtra) దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis)కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఈ ముగ్గురు కలిసి భారత్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు హాజరు కానున్నారు. అలాగే ఈ సదస్సులో ఏపీ మంత్రి లోకేష్(AP Minister Lokesh) కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.