Devara 2: 'దేవర 2' లో ఆ బాలీవుడ్ స్టార్స్ .. కొరటాల ప్లాన్ అదిరింది

‘దేవర 2’లో అతిథి పాత్రలు కూడా ఉంటాయి.

Update: 2024-10-13 09:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన మూవీ 'దేవర' మూవీ. ఈ మూవీ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకొచ్చింది. పది రోజుల్లోనే రూ.500 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు బ్రేక్ చేసింది.

ఇదిలా ఉండగా.. 'దేవర పార్ట్-2' ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా, కొరటాల శివ చేసిన కామెంట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ సీక్వెల్‌లో సైఫ్ అలీ ఖాన్ మాత్రమే కాకుండా బాలీవుడ్‌ స్టార్స్‌ ఉండే అవకాశం ఉందని తెలిపారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడుతూ.." నేను చెప్పేది జరుగుతుందో, లేదో నాకు తెలియదు కానీ.. ‘దేవర2’ లో స్టార్ హీరోలు రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ ఇద్దరూ ఉంటే బాగుంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దీని గురించి ఎక్కువ మాట్లాడను. ‘దేవర2’లో అతిథి పాత్రలు కూడా ఉంటాయి. అవే మూవీలో చాలా ముఖ్యమైనవి. అతి త్వరలోనే వాటికి సంబంధించిన డీటెయిల్స్ వెల్లడిస్తాను " అని చెప్పుకొచ్చారు

Tags:    

Similar News