‘నా భర్త చేసే చెత్త సినిమాల వల్ల నరకం అనుభవించాను’.. స్టార్ హీరో భార్య సంచలన కామెంట్స్

మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న మోహన్‌లాల్ (Mohanlal) అందరికీ సుపరిచితమే.

Update: 2024-11-13 03:37 GMT
‘నా భర్త చేసే చెత్త సినిమాల వల్ల నరకం అనుభవించాను’.. స్టార్ హీరో భార్య సంచలన కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న మోహన్‌లాల్(Mohanlal) అందరికీ సుపరిచితమే. ఈయన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ లెజెండ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ్ వంటి భాషా చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ.. నటుడిగా ఎన్నో జాతీయ అవార్డులను అందుకున్నాడు. ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న మోహన్‌లాల్ సినిమాల గురించి ఈయన సతీమణి సుచిత్ర(Suchithra)) రీసెంట్‌గా చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఆమె మాట్లాడుతూ.. “నా భర్త చేసే సినిమాల్లో నాకు నచ్చనివి కూడా ఉన్నాయి. కొన్ని మూవీల్లో నా భర్తని అలాంటి చెత్త పాత్రల్లో చూడలేకపోయాను. నాకు నచ్చకపోతే డైరెక్ట్‌గా అతనికే చెప్పేదాన్ని. మోహన్‌లాల్ కూడా నా రివ్యూస్‌కి చాలా విలువ ఇస్తాడు. నా నుండి ఆయన సినిమాకి పాజిటివ్ రివ్యూ వచ్చిందంటే ఆ సినిమా హిట్ అని ఆయన బలంగా ఫిక్స్ అయిపోతాడు. అలా సూపర్ హిట్ అయిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అయితే ఒక సినిమా హిట్ అవ్వడం, ఫ్లాప్ అవ్వడం అనేది కేవలం ఒకరి మీద ఆధారపడి ఉండదు. ఎందుకంటే ఎవరైనా సరే మంచి సినిమా తీయడానికే ఇష్టపడతారు. పనిగట్టుకొని ఫ్లాప్ మూవీస్ చేయాలని ఎవ్వరూ అనుకోరు” అంటూ ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News