Renu Desai: కన్నుల్లో, గుండెల్లో నీ రూపమే.. రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్

టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), హీరోయిన్ రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి ఆద్య, అకీరా నందన్ అనే పిల్లలు కూడా ఉన్నారు.

Update: 2024-10-16 08:11 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), హీరోయిన్ రేణు దేశాయ్(Renu Desai) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి ఆద్య, అకీరా నందన్ (Akira Nandan)అనే పిల్లలు కూడా ఉన్నారు. కానీ రేణు, పవన్ మధ్య మనస్పర్థలు రావడంతో కొద్ది కాలం క్రితమే విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారు. ఇక పవన్ రాజకీయాల్లో వెళ్లి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా స్వీకరించి ప్రజల సమస్యలు తీరుస్తున్నారు. రేణు దేశాయ్ మాత్రం పిల్లల బాధ్యత తీసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది. నిత్యం తన పిల్లలతో పలు వెకేషన్స్‌కు వెళ్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు చేస్తుంది. అలాగే జంతువులకు కూడా సహాయం చేస్తుంది. అయితే ఇటీవల మళ్లీ సినీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో.. తాజాగా, రేణు దేశాయ్(Renu Desai) ఓ వీడియో షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. కన్నుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే అనే సాంగ్‌ను తన ఫొటోకు యాడ్ చేసి షేర్ చేసింది. అలాగే.. ‘‘చాలామంది దృష్టిలో నేను ఒక సింగిల్ పేరెంట్‌ను మాత్రమే కాదు విడాకులు తీసుకున్న పెద్దగా నవ్వే స్త్రీని మాత్రమే. పురుషుల ప్రపంచంలో నా నిబంధనలపై జీవిస్తున్నాను. ఎవరు గట్టిగా మాట్లాడుతారో వారే ధృఢంగా ఉంటారు అని అనుకుంటున్నాను. మగవాడి ఆసరా లేకుండా తన పిల్లలను పరిపూర్ణంగా పెంచే తల్లిని. ఒక మహిళ తన సొంతంగా వ్యాపారాన్ని నడుపుతుందో ఆమె మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలదు అని నా అభిప్రాయం.

సమాజం అసమంజసమైన పితృస్వామ్య డిమాండ్లకు అనుగుణంగా ఇష్టపడని స్త్రీని. నన్ను అనుసరించే యువతులందరికీ స్వతంత్ర ఆలోచనా విధానం ఉంటే ఫర్వాలేదు అని చెప్పాలనుకుంటున్నాను. మీరు ప్రత్యేక దృక్పథాన్ని కలిగి ఉండటం సరైంది. మీ గుర్తింపు కేవలం ఒకరి కుమార్తెగా లేదా భార్యగా కాదు. మీకంటూ ఓ ప్రత్యేక జీవితం ఉంది కాబట్టి గుర్తింపు తెచ్చుకోవాలి. స్త్రీవాదం అంటే మనం సంప్రదాయ విలువలను అగౌరవపరచడం కాదు. కుటుంబ సంప్రదాయాల ముసుగులో శతాబ్దాల తరబడి సాగుతున్న అన్యాయాన్ని నిలదీయడం. మీ సామర్థ్యాన్ని నమ్మడం ప్రారంభించండి. మీకూడా ఒక జీవితం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి!’’ అని రాసుకొచ్చింది.

Tags:    

Similar News