స్టార్ హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చి 3 ఏళ్లు అవుతోందా.. ఇన్నేళ్లకు బయటపడ్డ షాకింగ్ సీక్రెట్.?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి(VIJAY THALAPATHY) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే అలా సినీ కెరీర్ పరంగా విజయవంతం అయిన విజయ్.. ఇప్పుడు రాజకీయపరం(POLITICAL)గా కూడా రాణించాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మొదటిసారి తన పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభను నిర్వహించారు. అయితే ఈ భారీ బహిరంగ సభకు విజయ్ అభిమానులతో పాటు ఎంతోమంది ఈ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు వచ్చారు. దాదాపు ఈ సభకి 8 లక్షల మంది వచ్చినట్టు తెలుస్తోంది. అలా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌తో ఈయన మొదటి పార్టీ మీటింగ్ సక్సెస్ అవ్వడంతో చాలామంది ఈయనకి రాజకీయాల్లో తిరుగులేని వారిగా ఎదుగుతారు అని కామెంట్లు పెడుతున్నారు. అయితే అభిమానుల్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉన్నప్పటికీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఎన్నో రూమర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక విజయ్ తమిళనాడు వెట్రి కజగం పార్టీ(Tamil Nadu Vetri Kazhagam Party) భారీ బహిరంగ సభలో సొంత భార్య సంగీత(SANGEETHA) పాల్గొనకపోవడంతో వీరి పర్సనల్ లైఫ్ పై ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
గత కొన్ని రోజులుగా విజయ్ తన భార్యతో విడాకులు(DIVORCE) తీసుకుంటున్నాడనే వార్తలు కోలీవుడ్(KOLLYWOOD)లో కోడై కూశాయి. అయితే ప్రస్తుతం మరో పుకారు నెట్టింట షికారు చేస్తోంది. అదేంటంటే..? వాళ్లు ఇప్పడు కాదు.. మూడు సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకొని వేరు వేరుగా ఉంటున్నారట. కానీ ఆయన సినీ లైఫ్ ఎక్కడ ఇబ్బందుల్లో పడుతుందేమోనని ఈ విషయాన్ని బయటకు రాకుండా ఇన్ని రోజులు సీక్రెట్‌గా ఉంచారని తెలుస్తోంది. అంతేకాదు ఇన్ని రోజులు సినిమాలే అనుకుంటే ప్రస్తుతం రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. కాబట్టి అటు సినిమాలు ఇటు రాజకీయాల్లో ఆయన సక్సెస్ అవ్వాలంటే పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఎక్కువ విషయాలు బయటకు రానివ్వకూడదు అనే ఉద్దేశంతో తన విడాకుల విషయాన్ని బయటకు రానివ్వడం లేదని తెలుస్తోంది. కానీ మరి కొంతమందేమో ఇవి రూమర్లు అని, విజయ్ సంగీత విడిపోలేదని, కేవలం చిన్న చిన్న మనస్పర్ధలు మాత్రం ఉన్నాయి అని అంటున్నారు. మరి తమిళ మీడియాలో ప్రచారం అవుతున్న విజయ్, సంగీతల విడాకుల వార్తల్లో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.