ఆ జట్టుకు షార్ప్‌నెస్ లేదు.. మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా
దిశ, వెబ్‌డెస్క్: గత ఏడాది సీజన్ సహా ఇప్పటి - Former cricketer Akash Chopra fired at Chennai Super Kings
దిశ, వెబ్‌డెస్క్: గత ఏడాది సీజన్ సహా ఇప్పటి వరకు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ విన్నర్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌కు పరాజాయాలు తప్పడం లేదు. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలో ఉన్న.. అంచనాలను అందుకోవడంలో విఫలం చెందుతుంది. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమై ఇన్ని రోజులైనా ఒక్క గెలుపును కూడా అందుకోవట్లేదు. చెన్నై జట్టు ఒక్క గెలుపు కోసం ఆరాటపడాల్సి వస్తోంది.. తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అయినా విజయం మాత్రం వరించట్లేదు. మరోవైపు మరోజట్టు ముంబై ఇండియన్స్ పరిస్థితీ ఇంతే. ఓటములను కొని తెచ్చుకోవడంలో ఈ రెండు టాప్ ఐపీఎల్ టీమ్స్ పోటీ పడుతున్నట్టు ఉన్నాయి.
ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైన తరువాత.. ఇప్పటిదాకా కోలుకోవట్లేదు. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, మూడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్.. నాలుగో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలోనూ మట్టి కరిచింది. దీంతో జట్టుపై ఘాటు విమర్శలకు దారి తీసింది. చెన్నై జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం జట్టులో లోపాలు ఉన్నాయనే విషయాన్ని అంగీకరించారు. వాటిని సరిదిద్దుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. అన్నింటికీ మించి ప్లేయర్లు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాల్సి ఉందని పేర్కొన్నారు.
కామెంటేటర్ ఆకాష్ చోప్రా CSK జట్టు ఆటతీరుపై తీవ్రంగా ఘాలు వ్యా్ఖ్యలు చేశారు. ప్రత్యర్థికి భారీ టార్గెట్లను నిర్దేశించడంలో గానీ, బ్యాటింగ్‌లో ఫైర్ లోపించిందని తేల్చి చెప్పాడు. నింపాదిగా ఆడటాన్ని అలవాటు చేసుకున్నట్టు కనిపిస్తోందని విమర్శించాడు. బౌలింగ్‌లో కూడా షార్ప్‌నెస్ లేదని, లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బంతులు వేయడంలో బౌలర్లు విఫలం అయ్యారని చెప్పాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప భారీ భాగస్వామ్యాలను నెలకొల్పడంలో విఫలమౌతున్నారన్నారు. రుతురాజ్‌పై జట్టు ఎక్కువగా ఆధారపడినట్టు కనిపిస్తోందిని పేర్కొన్నారు.