Robinhood: వన్ మోర్ టైమ్ అంటున్న నితిన్.. పోస్ట్ వైరల్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ (Nithin) నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’.
దిశ, సినిమా: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ (Nithin) నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ (Mythry Movie Makers) బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ భారీ బడ్జెట్‌తో నర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ‘రాబిన్‌హుడ్’ నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం.
ఈ మేరకు ‘ఈ సంవత్సరపు బెస్ట్ లవ్ సాంగ్‌ను వినేందుకు సిద్ధంగా ఉండండి.. రాబిన్‌హుడ్ (Robinhood) ఫస్ట్ సింగిల్ (First Single) ‘వన్ మోర్ టైమ్’ (One More Time) నవంబర్ 26న సాయంత్రం 5.04 గంటలకు మీ ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.