డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేతిరెడ్డి వ్యంగ్యస్త్రాలు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు.
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి(Former MLA Kethi Reddy), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పై సెటైర్లు వేశారు. ఈ రోజు వైసీపీ అధినేత జగన్(Jagan) పిలుపు మేరకు రాష్ట్రంలో పెరిగిన కరెంట్ చార్జీల(Current charges)కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతున్నా ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు లభించలేదని విమర్శించారు. ఎలక్షన్ సమయంలో బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. అనంతరం ఎన్నికల సమయంలో కూటమి పార్టీలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కరెంట్ చార్జీల పెంపుపై చేసిన వ్యాఖ్యలను మిమిక్రీ చేస్తూ.. పవన్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెటైర్లు(satyrs) వేశారు.
Read More..
మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు